పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పడం పెద్ద బోగస్ అని అన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఏప్రిల్ 18వ తేదీ చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాలలో పర్యటించారు సంజయ్. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వలేదు కానీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మేదెవరని ప్రశ్నించారు సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఏనాడైనా ప్రజల కోసం ఒక్క పోరాటమైనా చేశారా అని సంజయ్ నిలదీశారు.
కరీంనగర్ పార్లమెంట్ లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలుస్తోందని.. మిగితా పార్టీలది రెండో స్థానం కోసం ఆరాటమేనన్నారు బండి సంజయ్. ఆరు గ్యారంటీల మోసాలపై చర్చ జరుగుకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు శ్రీరాముడి పేరు వింటేనే వణుకు పుడుతోందని విమర్శించారు. తాము శ్రీరాముడి భక్తులం.. వాళ్లకు దమ్ముంటే బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలని సంజయ్ డిమాండ్ చేశారు.