
అల్వాల్, వెలుగు: గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నాన్ స్టాప్‌గా కొనసాగుతున్నాయి. తాజాగా రాయల్ చాలెంజ్ పేరుతో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేస్తున్న అల్వాల్‌లోని ఆదిత్య ఫుడ్స్‌లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ప్యాకేజ్, వాటర్ బాటిల్స్‌లో టీడీఎస్ తక్కువగా ఉందని అధికారుల పరీక్షల్లో తేలింది. దీంతో రూ.1.95 లక్షల వాటర్ బాటిల్స్‌ను అధికారులు సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆహార కల్తీ జరిగితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.