సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షలు కొట్టేశారు

పటాన్చెరులో  రెండు వేర్వేరు కేసుల్లో రూ.20 లక్షల దోచేశారు సైబర్ నేరస్థులు.   పటాన్చెరు ఏపీఆర్ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి మ్యాప్ రేటింగ్, లాడర్ గేమ్ పేరుతో ఆశ చూపి రూ. 2.13 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.  చిట్కుల్ గ్రామంలోని రమణ ఎంక్లేవ్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఆన్లైన్ జాబ్ పేరుతో పెట్టుబడి పెట్టించి రూ.  17.95 లక్షల దోచేశారు.  బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.