అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు : కోహెడలో కొత్తగా నిర్మిస్తున్న గడ్డిఅన్నారం మార్కెట్ పనులకు రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై మార్కెట్‌కమిటీ చైర్మన్చిలుక మధుసూదన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతి అంటూ బుధవారం ఆయన ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్కెట్‌కమిటీ వైస్చైర్మన్సీహెచ్భాస్కరచారి, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.