
బాలీవుడ్ మూవీ దిల్ బెచారా ఆన్ లైన్ లో వసూళ్ల ప్రవాహం కొనసాగుతుంది. రిలీజ్ డే నుంచి ఇప్పటి వరకు సుమారు 2వేల కోట్లు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు.
కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిన్నచిత్రాల నుంచి పెద్ద చిత్రాల వరకు అన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి.
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్ర దిల్ బెచారా సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు . జులై 24న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు అన్నీ కలుపుకొని సుమారు 2వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఆన్ లైన్ ఓటీటీలో దిల్ బెచారా టికెట్ రూ.200ఉండగా..ఓపెనింగ్ డే రోజు రూ.1900కోట్లకు పై చీలూకు కలెక్లన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆన్ లైన్ లో ఈ చిత్రానికి 24 గంటల్లో 95 మిలియన్ వ్యూస్ రాగా.. ట్రైలర్ ఎవెంజర్స్ ను బద్దలు కొట్టి 24 గంటల్లో 4.8 మిలియన్లకు పైగా లైక్స్ ను సంపాదించింది.