అక్రమ స్కానింగ్ ​సెంటర్ల అడ్రస్ ​ఇస్తే రూ.2 వేల గిఫ్ట్

  • వరంగల్‍ అర్బన్‍ డీఎంహెచ్‍వో 

వరంగల్‍ రూరల్‍, వెలుగు: వరంగల్‍ అర్బన్‍ జిల్లా పరిధిలో లింగ నిర్ధారణ టెస్టులు చేసే స్కానింగ్‍ సెంటర్లు.. ఆడ పిల్లల అబార్షన్లు చేసే.. పర్మిషన్​ లేని స్కానింగ్‍ సెంటర్ల ఇన్ఫర్మేషన్‍ ఇచ్చేవారికి రూ.2 వేలు గిఫ్ట్ ఇస్తామని డీఎంహెచ్‍వో లలితాదేవి ప్రకటించారు. అక్రమ స్కానింగ్‍లు, యూట్యూబ్‍లో చూసి అబార్షన్‍ చేయడం వంటి ఘటనల నేపథ్యంలో ‘అక్రమ స్కానింగ్‍లు.. యూట్యూబ్‍ అబార్షన్లు’ హెడ్డింగ్‍తో ‘వెలుగు’లో  ఆదివారం వచ్చిన స్టోరీపై జిల్లా కలెక్టర్‍ రాజీవ్‍గాంధీ హన్మంతు, మెడికల్‍ అండ్‍ హెల్త్ ఆఫీసర్లు స్పందించారు. ఈ నేపథ్యంలో డీఎంహెవో లలితాదేవి బుధవారం ప్రత్యేక కమిటీ మెంబర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ స్కానింగ్‍లు, అబార్షన్లు చేస్తున్నవారిపై స్పెషల్​ ఫోకస్ ​పెట్టినట్లు చెప్పారు. కలెక్టర్​ఆదేశాలతో అన్ని స్కానింగ్‍ సెంటర్లను తనిఖీ చేయనున్నట్లు వివరించారు. అక్రమ స్కానింగ్ ​సెంటర్ల వివరాలు చెబితే రూ.2వేలు గిఫ్ట్ ​ఇస్తామని చెప్పారు. ఇన్ఫర్మేషన్​ఇచ్చినోళ్ల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్​ చేస్తామన్నారు. 104, 1098 టోల్‍ ఫ్రీ నంబర్లు అందరికీ తెలిసేలా ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ముందుగా ఇలా స్కానింగ్‍ సెంటర్లను అలర్ట్ చేయడాన్ని జనాలు తప్పుపడుతున్నారు.