వ్యవస్థలో మిగిలిన 2వేల నోట్లు రూ.6,577 కోట్లే

వ్యవస్థలో మిగిలిన 2వేల నోట్లు రూ.6,577 కోట్లే

న్యూఢిల్లీ: చలామణిలో ఉన్న 98.15 శాతం రెండు వేల రూపాయిల నోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్‌‌బీఐ ప్రకటించింది. కేవలం రూ.6,577 కోట్ల విలువైన 2000  నోట్లే ఇంకా బయట ఉన్నాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను  వ్యవస్థలో నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నామని 2023, మే 19న  ఆర్‌‌బీఐ ప్రకటించింది. ఆ టైమ్‌లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయిల నోట్లు చలామణిలో ఉన్నాయి.

ఈ  నోట్లను  అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకులు దగ్గర డిపాజిట్ చేయడానికి లేదా ఇతర కరెన్సీ నోట్లతో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.  ప్రస్తుతం దేశంలోని 19 ఆర్‌‌బీఐ రీజినల్ ఆఫీసుల్లోనే 2000 నోట్లను డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్‌ చేసుకోవడానికి వీలుంది. అంతేకాకుండా ప్రజలు పోస్ట్ ఆఫీస్‌ ద్వారా ఆర్‌‌బీఐ ఆఫీసులకు పంపొచ్చు. కాగా, రూ.2000 నోట్లు లీగల్‌గా చెల్లుబాటు అవుతాయి.