పిల్లల దీనస్థితిపై వీడియో.. ఇన్ స్టాలో రూ. 21లక్షలు సాయం చేసిన దాతలు

పిల్లల దీనస్థితిపై వీడియో.. ఇన్ స్టాలో రూ. 21లక్షలు సాయం చేసిన దాతలు

నర్సింహులపేట, వెలుగు: బ్రెయిన్ స్ట్రోక్‎తో చనిపోయిన బాలింత కుటుంబానికి దాతలు స్పందించి భారీగా ఆర్థికసాయం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటకు చెందిన బేతమల్లు నరేశ్, ఉమ దంపతులు. కాగా వీరికి మూడేండ్ల కింద పాప పుట్టింది. గత జులై 28న బాబుకు జన్మనిచ్చిన 8 రోజుల తర్వాత ఉమ బ్రెయిన్ స్ట్రోక్‎తో చనిపోయింది. పాప, బాబు దీనస్థితిపై గ్రామానికి చెందిన రఘు, యాకయ్యతో పాటు మరికొంత యువకులు వీడియో చేసి  ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో దాతలు స్పందించి రూ. 21 లక్షలు ఆర్థిక సాయం చేయగా.. మహబూబాబాద్ ఎస్ బీఐ బ్యాంక్ లో ఇద్దరు పిల్లల పేరున డిపాజిట్ చేసి బాండ్ ను గురువారం నరేశ్ కు అందించారు.  దాతల ఆర్థిక సాయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.