మాస్టర్ ప్లాన్ బూంరాంగ్ : సీసీకెమెరాలకు నల్ల రంగు.. తీరిగ్గా ఏటీఎం దోపిడీ..

నల్లగొండ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఏటీఎం చోరీ కేసులో  సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఎన్‌హెచ్ 65లో గల ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.23 లక్షల నగదును  దొంగలు అపహరించారు. సీసీ కెమెరాల ఉన్నా నిర్భయంగా చోరీ చేశారు దొంగలు. ఏటీఎం లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇమేజ్‌ కనిపించకుండా కెమెరాపై బ్లాక్ పెయింట్‌ను స్ప్రే చేశారు. 

ఏటీఎంలో నగదు ఉన్న బాక్సును తెరిచేందుకు దొంగలు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రెండు ఏటీఎం లలో నగదును అపహరించి మారుతీ ఓమ్నీ వ్యాన్‌లో పరారయ్యారు. దొంగలు ఇతర యంత్రాన్ని పగులగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అందులో రూ.40 లక్షల నగదు ఉంది. తదుపరి విచారణ కోసం కేసు నమోదు చేసి వేలిముద్రలు సేకరించారు. చోరీ అనంతరం రెండు ఇనుప రాడ్‌లను వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

“మేము దర్యాప్తు ప్రారంభించాం, త్వరలో నిందితులను పట్టుకుంటాం. NH 65లోని పంతంగి ,కొర్లపహాడ్ వద్ద ఉన్న టోల్ ప్లాజాల గుండా వెళ్ళిన అన్ని వాహనాల వివరాలు వారు ఉపయోగించిన వ్యాన్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.