హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు.. ఒక చోట టిఫిన్ చేద్దామని బస్సు దిగి.. టిఫిన్ చేసి వచ్చేసరికి బ్యాగ్ లో ఉన్న డబ్బులు దొంగిలించారు దుండగులు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్ర ప్రదేశ్ బాపట్లకు చెందిన వెంకటేష్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ కు వెళుతూ రూ. 23 లక్షల డబ్బును బ్యాగులో తీసుకెళ్తున్నాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో నార్కట్ పల్లి పరిధిలోని పూజిత హోటల్ వద్ద జరగింది ఈ చోరీ. బాధితుడు హోటల్లో టిఫిన్ చేసి వచ్చి బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు గుర్తించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు నార్కట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ALSO READ | గురుమూర్తికి తల్లి, చెల్లి, తమ్ముడు కూడా సహకరించారట.. రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు..
బాధితుని నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలో ఒక వ్యక్తిని అనుమనితుని గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.