హోంశాఖకు రూ.2.33 లక్షల కోట్లు

హోంశాఖకు రూ.2.33 లక్షల కోట్లు
  • వాటిలో రూ.1.60 లక్షల కోట్లు కేంద్ర పోలీసు బలగాలకే..

న్యూఢిల్లీ: హోం మంత్రిత్వ శాఖకు కేంద్ర బడ్జెట్​లో రూ.2,33,210.68 కోట్లు కేటాయించారు. వాటిలో మెజారిటీ నిధులు రూ.1,60,391.06 కోట్లు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పోలీసు బలగాలకు అలొకేట్  చేశారు. హోం శాఖకు నిరుడు రూ.2,19,643.31 కోట్లు కేటాయించగా.. ఈసారి కేటాయింపులు రూ.13,567.37 కోట్లు పెరిగాయి. 

జమ్మూకాశ్మీర్​కు రూ.41 వేల కోట్లు, అండమాన్  నికోబార్  దీవులకు రూ.6,212.06 కోట్లు, చండీగఢ్​కు రూ.6,187.48 కోట్లు, దాద్రానగర్  హవేలి, డామన్  అండ్  డయ్యూకు రూ.2,780 కోట్లు, లద్దాఖ్​కు రూ.4,692.15 కోట్లు, లక్షద్వీప్​కు రూ.1,586.16 కోట్లు, పుదుచ్చేరికి రూ.3,432.20 కోట్లను నిర్మలా సీతారామన్  కేటాయించారు. 

పారామిలిటరీ బలగాల్లో సీఆర్పీఎఫ్​కు రూ.35,147.17 కోట్లు, బీఎస్ఎఫ్​కు రూ.28,231.27 కోట్లు, సీఐఎస్ఎఫ్​కు రూ.16,084.83 కోట్లు, ఐటీబీపీకి రూ.10,370 కోట్లు, సహస్ర సీమా బల్ (ఎస్ఎస్ బీ) కు రూ.10,237.28 కోట్లు, అస్సాం రైఫిల్స్​కు రూ.8,274.29 కోట్లు కేటాయించారు. 

ఇంటెలిజెన్స్  బ్యూరో (ఐబీ)కు రూ.3,893.35 కోట్లు, ఢిల్లీ పోలీసుకు రూ.11,931.66 కోట్లు, స్పెషల్  ప్రొటెక్షన్  గ్రూప్ కు రూ.489 కోట్లు అలొకేట్  చేశారు. జమ్మూకాశ్మీర్  పోలీసు శాఖకు రూ.9,325.73 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ కు రూ.1,922.59 కోట్లు, పోలీసు బలగాల ఆధునీకరణకు రూ.4,069.24 కోట్లు కేటాయించారు. జైళ్ల ఆధునీకరణకు రూ.300 కోట్లు కేటాయించారు.