![ఎంత డబ్బుంటే మాత్రం : వజ్రాల టీ పాట్.. గిన్నిస్ రికార్డ్..](https://static.v6velugu.com/uploads/2023/08/Rs-24-Crore-For-A-Teapot--Record-Breaking_sYhITbBFzd.jpg)
టీ పాట్ (Teapot) గురించి తెలిసే ఉంటుంది.. టీ పోసుకునే జార్ లాంటి పాట్‌ని టీ పాట్ అంటారు. ఇది అందరికీ అందుబాటు ధరలోనే దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీపాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని ధర రూ. కోట్లల్లో ఉంటుంది. అంత ఖరీదైన టీపాట్, దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
అదో టీ పాట్. చూస్తేనే కాదు దాని ధర వింటే కళ్లు జిగేల్ మని అంటాయి. ఎందుకంటే దాని ధర ఆ రేంజ్ లో ఉంది. సాధారణంగా టీ పాట్స్ అంటే పింగాణీవి ఉంటాయి. వాటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. చైనా పింగాణికి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి చైనా పింగాణీతో తయారైన టీపాట్ అయితే వేలల్లో ఉంటుందని అనుకుందాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ పాట్ ధర రూ.వేలు కాదు లక్షలు కూడా కాదు ఏకంగా కోట్లల్లో ఉంది.
భారతదేశం అంతటా అత్యంత ఇష్టపడే పానీయాలలో టీ ఒకటి. లెక్కలేనన్ని మంది ప్రజలు ఉదయాన్నే నిద్రలేవడానికి ఈ వినయపూర్వకమైన పానీయం ద్వారా ప్రమాణం చేస్తారు. మసాలా చాయ్ నుండి బ్లాక్ టీ వరకు, కటింగ్ చాయ్ నుండి ఎలైచి-అడ్రాక్ చాయ్ వరకు – చాలా రకాల టీలు అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయకంగా, ఈ పానీయాన్ని సాసర్, ఒక కప్పు హాయిగా టీతో అందించడానికి టీ సెట్ ఉపయోగించబడింది. ఇటీవల, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2016 నుండి రికార్డును కలిగి ఉన్న ప్రపంచంలోనే అత్యంత విలువైన టీపాట్ గురించి పోస్ట్‌ను పంచుకుంది.. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ టీపాట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టీపాట్ గా క్రెడిట్ కొట్టేసింది. అంత్యంత కళాత్మకతను, చరిత్రకు చిహ్నంగా ఈ టీపాట్ నిలిచింది. 2016 నుంచి దీనికి విశేషమైన రికార్డు ఉంది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏదీ బ్రేక్ చేయలేదు. 18క్యారెట్ల బంగారంతో.. 1658 వజ్రాలు పొదగబడిన ఈ టీపాట్ లో 6.67 క్యారెట్ల రూబీలను కూడా అమర్చారు. దీంతో ధర అక్షరాల రూ.24 కోట్లు..దీంతో ఇది గిన్నిస్ రికార్డు(Guinness World Records)ను కొల్లగొట్టింది. ఈ టీపాట్ గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వజ్రాలతో ధగధగా మెరిసిపోయే ఈ పాట్ తెగ వైరల్ అవుతోంది.
This is the most valuable teapot in the world.
— Guinness World Records (@GWR) August 9, 2023
Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre.
The teapot's handle is made from fossilised mammoth ivory.
It… pic.twitter.com/TFZZF63YiW
ఈ టీకప్పును యూకేకు చెందిన ఎన్ సేతియా ఫౌండేషన్( N Sethia Foundation), న్యూబీ టీస్ ఆఫ్ లండన్ (Newby Teas of London)సహకారంతో రూపొందించారు. ఇటాలియన్ జ్యుయలర్ ఫుల్వియో స్కావియా దీన్ని తయారు చేశారు. 2016లో ప్రపంచ రికార్డు అందుకుంది. ఈ టీ కప్పులో 1658 వజ్రాలు,18 క్యారెట్ల బంగారం,386 థాయ్, బర్మీస్ రూబీలు ఒదిగిపోయాయి. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ పేజీలో ఈ నెల 9న పోస్ట్ చేసింది. అద్భుతమైన, అత్యంత ఖరీదైన ఈ టీపాట్‌ను మీరూ చూసేయండి .