- రూ. 25 లక్షల డబ్బు..
- 20 తులాల బంగారం స్వాధీనం
- నోవాటెల్‌లో హెల్పర్, జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్
- పేట్ బషీర్‌బాగ్‌లో 21 తులాల బంగారం మాయం
జూబ్లీహిల్స్,వెలుగు: సంక్రాంతికి ఊరెళ్లగా ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దోచుకుపోయారు. ఈ కేసులో ఇద్దరు దొంగలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ఏసీపీ సామల వెంకట రెడ్డి కథనం ప్రకారం..ఇంద్రానగర్ కు చెందిన లోవ వెంకటరమణ, లక్ష్మి దంపతులు సంక్రాంతికి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్లారు. పై అంతస్తులో ఓనర్లు, కింద పోర్షన్లో కరుణాకర్ఉంటున్నాడు. 14న ఉదయం కరుణాకర్మోటార్స్విచ్వేయడానికి వెళ్లగా, వెంకటరమణ ఇంటి తలుపులు తీసి కనిపించాయి.
వారికి ఫోన్‌చేసి తలుపులు తీసి ఉన్నాయని చెప్పగా, తాము రాలేదని సమాధానమిచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు.
బైక్ నంబర్ ఆధారంగా...
మధురానగర్‌కు చెందిన పాత నేరస్తుడు దాసరి రక్షక్ రాజు (27) హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో హెల్పర్. ఇతడిపై జూబ్లీహిల్స్పీఎస్లో రెండు దొంగతనం కేసులున్నాయి. ఇతడికి జూనియర్ఆర్టిస్గా పనిచేస్తున్న ఇంద్రానగర్చెందినతిరుమల్రెడ్డి (49)కి ఫేస్‌బుక్‌ద్వారా పరిచయమైంది. ఈ నెల 14న తిరుమల్‌రెడ్డి, రాజు కలిసి మద్యం తాగారు. తర్వాత తిరుమల్‌రెడ్డి బైక్నడపగా రాజు వెంకటరమణ ఇంటి దగ్గరకు తీసుకువెళ్లాడు. అక్కడే కూర్చోబెట్టి వెంకటరమణ ఇంటికి వెళ్లి తాళాలు పగలగొట్టి చోరీ చేశాడు.
తర్వాత బైక్‌పై వెళ్లిపోయారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు ఇద్దరూ అనుమానస్పదంగా కనిపించడంతో విచారించారు. దీంతో రాజు తానే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. తిరుమల్‌రెడ్డి మాత్రం తనకు ఏమీ తెలియదని, రాజు 5 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ చెప్పారు. సీఐ రాఘవేంద్ర, డీఐ బషీర్‌అహ్మద్ కేసు దర్యాప్తు చేశారు.
పండగకు ఊరెళ్లి వచ్చేసరికి బంగారం దోచేశారు
జీడిమెట్ల, వెలుగు: పండగకి ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారం దొంగలించిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మంజిల్లాకు చెందిన శ్యామల, ఉదయ్ సాయిప్రసన్నలు సుచిత్ర, బౌద్ధనగర్‌లోని విజయహోమ్స్ లోని విల్లాలో నివాసముంటున్నారు.
కాగా ఈనెల 12న వీరు సంక్రాంతి పండగకి సొంతూరికి వెళ్లారు . దొంగలు విల్లాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలోంచి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 21తులాల బంగారం, రూ.5వేల నగదు దొంగలించారు. బీరువాలో ఉన్న వెండివస్తువులు, ఇతర సామగ్రి వదిలేసి వెళ్లారు. బాధితుల ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.