రూ. 25 వేల కోట్లతో అమరావతికి ఔటర్  రింగ్  రోడ్ సాంక్షన్ : పురందేశ్వరి

అమరావతికి ఔటర్  రింగ్  రోడ్  ప్రాజెక్టు సాంక్షన్  అయిందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. రూ.25 వేల కోట్ల వ్యయంతో 189 కిలోమీటర్లలో ప్రాజెక్టు ఉంటుందని మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ, నిర్మాణ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.