
- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50లక్షల వ్యయంతో నిర్మించిన ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను సోమవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి.రాహుల్ ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్లతో కలిసి వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, విద్యాభివృద్ధికి ఐటీడీఏ పీవో బి.రాహుల్ కృషి చేస్తున్నారని అభినందించారు.
పీవో రాహుల్ మాట్లాడుతూ.. స్కూళ్లు తిరిగి ఓపెన్అయ్యే నాటికి అవసరమైన రిపేర్లు, కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసేలా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. కెరీర్ గైడెన్స్ పై దృష్టి సారించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఏటీడీవో అశోక్‌కుమార్, హెచ్ఎం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.