కంటిచూపు పోగొట్టినందుకు దవాఖానకు 3 లక్షల పెనాల్టీ

కంటిచూపు పోగొట్టినందుకు దవాఖానకు 3 లక్షల పెనాల్టీ

కరీంనగర్ సిటీ, వెలుగు: కంటి ఆపరేషన్​లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రికి డిస్టిక్ కన్జ్యూమర్ ఫోరం రూ.3 లక్షల పెనాల్టీ విధించింది. కంటి చూపు సరిగ్గా లేదని కరీంనగర్​లోని వాసన్ ఐ కేర్ ఆస్పత్రికి వెళ్లిన అదే సిటీకి చెందిన కె.నర్సాగౌడ్​కు డాక్టర్లు 2016లో ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత  నర్సాగౌడ్‍ కంటి నుంచి రక్తం రావడంతో తిరిగి వెళ్లగా.. హైదరాబాద్ లోని బ్రాంచికి పంపించారు. కరీంనగర్‍లో చేసిన కంటి ఆపరేషన్‍ ఫెయిల్ కావడంవల్లే చూపు పోయినట్లు హైదరాబాద్ కూకట్​పల్లి బ్రాంచి ఆస్పత్రి డాక్టర్లు తేల్చారు. దీంతో నర్సాగౌడ్‍ కరీంనగర్​లోని కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. సర్జరీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి.. పేషెంట్​కు రూ.3 లక్షల జరిమానా చెల్లించాలని ఫోరం చీఫ్ కె.స్వరూపారాణి, సభ్యులు ఎస్‍.శ్రీలత, ఎం.రాజశేఖర్‍ బుధవారం తీర్పునిచ్చారు.

For More News..

టీఆర్ఎస్ ఓడిందని కార్యకర్త సూసైడ్.. పాడే మోసిన మంత్రులు

కాంట్రాక్ట్‌‌ జాబ్స్‌‌ వైపు హైదరాబాదీలు

దుబ్బాక తీర్పు.. తెస్తది మార్పు!