రూ. 30 లక్షల విలువైన సిగరెట్లు చోరీ..భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఘటన

రూ. 30 లక్షల విలువైన సిగరెట్లు చోరీ..భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఘటన

పాల్వంచ, వెలుగు : షాపులో నిల్వ చేసిన రూ. 30 లక్షల విలువైన సిగరెట్‌‌‌‌ ప్యాకెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. పట్టణానికి చెందిన పవన్‌‌‌‌ మనియా స్థానిక మార్కెట్‌‌‌‌ ఏరియాలో డీఎంఆర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి షాప్‌‌‌‌ బంద్‌‌‌‌ చేసిన వెళ్లిన పవన్‌‌‌‌ శనివారం ఉదయం వచ్చి షాపు తెరిచాడు.

లోపల సిగరెట్లకు కాటన్లు చిందరవందరగా పడేసి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు పక్కనే ఉన్న గది తలుపులు పగులగొట్టి, షట్టర్‌‌‌‌ను తొలగించి దొంగలు షాపులోకి వచ్చినట్లు నిర్ధారించారు. మొత్తం రూ. 30 లక్షల విలువైన 23 సిగరెట్‌‌‌‌ కాటన్లు చోరీ అయినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై సుమన్‌‌‌‌ క్లూస్, డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌తో తనిఖీలు నిర్వహించారు.