కూసుమంచి శివాలయం అభివృద్ధికి రూ 3.30 కోట్లు

కూసుమంచి శివాలయం అభివృద్ధికి రూ 3.30 కోట్లు

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం అభివృద్ధికి రూ.3.30 కోట్లు మంజూరయ్యాయి. పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఇటీవల ఎస్​డీఎఫ్​ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిధులతో సుభద్ర మండపం కోసం రూ.1.25 కోట్లు, ప్రాకారం వాల్ కోసం రూ. 1.41కోట్లు, కళ్యాణ మండపం కోసం రూ. 25 లక్షలు, ఆఫీస్​ రూమ్​, స్టోర్​ రూమ్​ కోసం రూ.15.50 లక్షలు, కిచెన్​ కోసం రూ.8.50 లక్షలు, దేవాలయం ముందు భాగంలో ఆర్చి గేట్ కోసం రూ.14.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. దీనిపట్ల కూసుమంచి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.