సెకండ్​ హ్యాండ్ ​వెహికల్స్​పేరిట 38 లక్షల మోసం

సెకండ్​ హ్యాండ్ ​వెహికల్స్​పేరిట 38 లక్షల మోసం

బషీర్ బాగ్, వెలుగు: సెకండ్ హ్యాండ్ వెహికల్స్​పేరిట సిటీకి చెందిన వ్యాపారిని సైబర్​నేరగాళ్లు చీట్​చేశారు. రూ.38లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన వ్యాపారి(41)కి సైబర్​నేరగాళ్లు పలు వాట్సాప్​నంబర్ల ద్వారా సంప్రదించారు. మంచి కండిషన్ లో ఉన్న హైఎండ్ కార్లు, జేసీబీ, ఐచర్ వెహికల్స్ ఉన్నాయని.. తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికారు. 

చోళమండల్ ఇన్​వెస్ట్​మెంట్​ఫైనాన్స్ కంపెనీ పేరిట వెహికల్స్ వివరాలు పంపారు. నిజమేనని నమ్మిన వ్యాపారి రూ.37లక్షల95వేలు పంపించాడు. తర్వాత వెహికల్స్ రాకపోవడంతో ఫోన్​చేసి నిలదీయగా, స్కామర్లు దాటవేస్తూ వచ్చారు. మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.