ఆ స్టార్ హీరో తన మాజీ భార్యకి భరణంగా రూ.380 కోట్లు ఇచ్చాడా..?

ఆ స్టార్ హీరో తన మాజీ భార్యకి భరణంగా రూ.380 కోట్లు ఇచ్చాడా..?

ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకుల వ్యవహారాలు ఎక్కువవుతున్నాయి. అయితే ఒకప్పుడు విడాకులంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో పెళ్లయిన ఐదారేళ్లులోపే ఉండేవి.. లేదంటే పెళ్లయిన తర్వాత భార్య భర్తల మధ్య అనతికాలంలోనే మనస్పర్థలు, విభేదాలు రావడంతో వెంటనే విడిపోయేవారు.. కానీ ఇప్పుడలా కాదు.. పెళ్లయి, పెళ్లి ఈడుకొచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ విడాకులు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడటం లేదు.. అంతేగాకుండా విడాకుల అనంతరం భరణం కూడా రూ.కోట్లలో అందుకుంటున్నారు..

అయితే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నె ఖాన్ తో విడాకుల వ్యవహారం ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే హృతిక్ రోషన్ సుసాన్నె ఖాన్ 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2014లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 

విడాకుల సమయంలో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్ కి భరణంగా దాదాపుగా రూ.380 కోట్లు చెల్లించాడట.. అంతేకాదు వీరికి జన్మించిన హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ సంరక్షణ బాధ్యతలు కూడా హృతిక్ రోషన్ చూసుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఇటీవలే ఓ స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకోగా భరణం రోపంలో తన మాజీ భర్యకి దాదాపుగా రూ.60 కోట్లు పైగా చెల్లించాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటివరకూ బాలీవుడ్ లో హైయ్యెస్ట్ భరణం అందుకున్నది ఎవరనే విషయంలో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నె ఖాన్ ట్రెండ్ అవుతున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా హృతిక్‌‌‌‌ రోషన్‌‌‌‌ ప్రెజెంట్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నాడు. అయాన్ ముఖ‌‌‌‌ర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా హృతిక్‌‌‌‌ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో  కియారా అద్వానీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఆగస్టు 14న సినిమా రిలీజ్ కానుంది.