టేకుమేటా ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ మృతులపై రూ.40 లక్షల రివార్డ్‌‌‌‌

టేకుమేటా ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌ మృతులపై రూ.40 లక్షల రివార్డ్‌‌‌‌
  • ప్రకటించిన బస్తర్‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌ రాజ్‌‌‌‌. పి

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌ జిల్లా టేకుమేటా అడవుల్లో శనివారం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో చనిపోయిన మావోయిస్టులపై రూ.40 లక్షల రివార్డు ఉందని బస్తర్‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌రాజ్‌‌‌‌.పి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మృతుల వివరాలను ఐజీ వెల్లడించారు. మృతులు డీకేసీఎం కమాండర్‌‌‌‌ వనోజామిచా కరామ్, ప్లాటూన్‌‌‌‌ సభ్యుడు సంతోష్‌‌‌‌ కర్చామీ, మనేశ్‌‌‌‌, సురేశ్‌‌‌‌, పునీతగా గుర్తించినట్లు తెలిపారు. ఒక్కొక్కరిపై రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు.

వీరు మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల్లో అనేక విధ్వంసాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. మరోవైపు టేకుమేట, ముస్పర్సీ గ్రామాల నుంచి భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ యువకులను సోమవారం రిలీజ్‌‌‌‌ చేశారు. వారిని ఛోటేబేటియా పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో అప్పగించారు. వారి కోసం గ్రామస్తులు రెండు రోజులుగా అడవుల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. వారంతాక్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.