మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. రూ.40 లక్షలతో ఆఫీస్ బాయ్ పరార్ ..

మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. రూ.40 లక్షలతో ఆఫీస్ బాయ్ పరార్ ..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి ముంబై కార్యాలయంలో రూ.40 లక్షల దొంగతనం జరిగినట్లు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అయితే  ప్రీతమ్ చక్రవర్తి మేనేజర్ వినీత్ ఛేడా ఓ ప్రొడక్షన్ హౌజ్ నుంచి రూ.40 లక్షలు ట్రాలీ బ్యాగ్ లో తీసుకొచ్చి ఆఫీస్ లో ఉంచాడు. ఇదే సమయంలో వినీత్ ఛేడాతోపాటూ ఆశిష్ సాయల్, అహ్మద్ ఖాన్ అనే ఇద్దరు ఉద్యోగుల ఆఫీసులోనే ఉన్నారు. అయితే పని నిమిత్తమై వినీత్ ఛేడా అదే బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రీతమ్ చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి డబ్బు సంచి కనిపించలేదు. 

ALSO READ | ఇదేం పిచ్చి అభిమానం.. హీరోపై అభిమానంతో రూ.72 కోట్లు ఆస్తులను రాసిన లేడీ ఫ్యాన్..

దీంతో డబ్బు సంచి గురించి సిబ్బందిని అడగ్గా ఆశిష్ సాయల్ ప్రీతమ్ చక్రవవర్తి ఇంట్లో ఇవ్వడానికి తీసుకుని వెళ్లాడని చెప్పారు. దీంతో అనుమానం కలిగి వినీత్ ఛేడా ఆశీష్ సాయిల్ కి ఫోన్ చెయ్యగా స్విచాఫ్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రీతమ్ కి తెలియజేయగా దగ్గరలోని పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆశిష్ సాయల్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆశిష్ సాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ని అదుపులోకి తీసుకుని విచ్చరిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రీతమ్ చక్రవర్తి బాలీవుడ్ లో దాదాపుగా 70కి పైగా సినిమాలకి సంగీతం అందించాడు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ తదితర స్టార్ హీరోలతో కలసి పనిచేశాడు. చివరగా గత ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ (ఓన్లీ మ్యూజిక్) సాంగ్స్ కమోజ్ చేశాడు.