వికారాబాద్ నియోజకవర్గానికి రూ. 4.5 కోట్ల నిధులు

వికారాబాద్ నియోజకవర్గానికి రూ. 4.5  కోట్ల నిధులు

వికారాబాద్​, వెలుగు:   చేవెళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  సహకారంతో మంజూరైన కేంద్రం నిధులతో మోమిన్ పేట మండలంలోని మేకవనంపల్లిలో సీసీ  రోడ్లకు  బీజేపీ నాయకులు ఆదివారం శంకుస్థాపన చేశారు.  మండల బీజేపీ అధ్యక్షుడు ఆశీరెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి  పనులు ప్రారంభించారు.  నియోజకవర్గంలో ఎంపీ నిధులు రూ.4.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో  దిశా కమిటీ సభ్యులు వడ్ల నందు, డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి , జేకేఎంఆర్ ఫౌండర్ రాములు, మోమిన్ పేట  మండల్ మాజీ అధ్యక్షులు భుజంగరెడ్డి, లక్ష్మారెడ్డి, మండల కిషన్ మోర్చా అధ్యక్షులు రాజిరెడ్డి పాల్గొన్నారు.