ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను మట్టి కరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ విజయంతో అతనికి దక్కిన ప్రైజ్‌మనీ అక్షరాలా 11 కోట్ల రూపాయలు. మరి ఇంతే మొత్తం అతనికి చెందుతుందా..! అంటే లేదు. ఈ మొత్తంలో దాదాపు రూ.రూ. 4.67 కోట్లు పన్ను రూపంలో ఆర్థిక శాఖ ఖజానాకు వెళ్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రూ.11 కోట్ల ప్రైజ్‌మనీలో రూ. 4.67 కోట్లు పన్ను అంటే.. దాదాపు 40 శాతంపైనే. ఇదే నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గుకేశ్ ప్రైజ్‌మనీపై పడే 'ట్యాక్స్' విషయంపై గత రెండ్రోజులుగా నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. "గెలిచింది గుకేశ్ కాదు.. కేంద్ర ఆర్థిక శాఖ" అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. కష్టార్జితాన్ని నిర్మలా సీతారామన్ ఇలా దోచేస్తున్నారంటూ.. మరికొందరు కేంద్ర ఆర్థికమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ALSO READ | IND vs AUS 3rd Test: సచిన్ వీడియోలు చూసి నేర్చుకో.. కోహ్లీకి సునీల్ గవాస్కర్ సలహా
ఇంతకీ గుకేశ్ ఎంత ట్యాక్స్ కట్టాలంటే..!
అతని ప్రైజ్‌మనీ దాదాపు రూ. 11కోట్లు కావున గుకేశ్ 30శాతం ట్యాక్స్ స్లాబ్ కిందకు వస్తాడు. ఆదాయపు పన్ను శాఖ కాలిక్యులేటర్ ప్రకారం, ఆ పన్ను మొత్తం సుమారు రూ. 3కోట్ల 28లక్షలు. దీనికి సర్ఛార్జ్.. రూ. కోటి 30 లక్షలు. ఈ మొత్తానికి సెస్ కలుపుకుంటే దాదాపు రూ. 4.67 కోట్ల వరకు ఆర్థిక శాఖకు వెళ్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.
#GukeshD will have to pay more than 42% of the 11 crore prize money as income tax#GukeshWorldChampion pic.twitter.com/HBySYrV2YB
— Mridul Sharma (@msharma_1) December 13, 2024
దేశంలో అధిక పన్నులపై గత కొంతకాలంగా విపరీతంగా చర్చలు జరుగుతున్న సమయంలో.. గుకేశ్ ప్రైజ్‌మనీ ట్యాక్స్ మరింత చర్చనీయాంశం అవుతోంది.
Nirmala Paati after billing 4.7 crores as tax for Gukesh. pic.twitter.com/fV1nMSlRFr
— Nibras (@nottheLingerie) December 15, 2024
nirmala sitharaman waiting at airport to tax gukesh's prize money pic.twitter.com/YEo51ipSBP
— Heeeer (@heeexv) December 13, 2024
Congrats to the Indian Tax dept for winning the World Chess Championship and earning 5 crores out of the 11 crore prize money.
— Gabbar (@GabbbarSingh) December 13, 2024