
హైదరాబాద్, వెలుగు: వెబ్ 3.0 టెక్నాలజీ కంపెనీ స్ట్రింగ్ మెటావర్స్ తన రైట్స్ఇష్యూ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించింది. మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) సాధించడంలో భాగంగా రైట్స్ ఇష్యూను ప్రత్యేకంగా పబ్లిక్ షేర్‌హోల్డర్లకు అందించామని ప్రకటించింది. ఇష్యూ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కంపెనీలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 19 శాతానికి పెరుగుతుంది. రైట్స్ ఇష్యూ కింద మొత్తం 94,71,445 షేర్లను అమ్మడం ద్వారా రూ.49.25 కోట్లను సేకరించింది. ఇష్యూ రూ.100 కోట్ల వరకు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయింది.