సింగరేణి కరోనా వారియర్​ ఫ్యామిలీకి రూ.50 లక్షలు

కేంద్రం తరఫున సాయం.. చెక్కును అందజేసిన సింగరేణి డైరెక్టర్

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి కరోనా వార్డులో పనిచేస్తూ వైరస్ సోకి చనిపోయిన స్వీపర్​ జి.గురుమూర్తి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల చెక్కును అందజేసింది. ఈ ఏడాది జులై 25న ఆ కరోనా వారియర్​ మరణించారు. దీంతో ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన కింద నిధులు విడుదల కావడంతో ఆయన భార్య లలితకు సింగరేణి డైరెక్టర్​ ఎస్​.చంద్రశేఖర్​ చెక్కును బుధవారం అందజేశారు. కాంపెన్సేటివ్​ ఎంప్లాయ్​మెంట్​ కింద గురుమూర్తి పెద్ద కొడుకుకు సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని చంద్రశేఖర్​ హామీ ఇచ్చారు. కరోనా పేషెంట్లకు సేవలందించే క్రమంలో వారియర్స్​ కూడా దాని బారిన పడి చనిపోతున్నారని, కేంద్రం ఇస్తున్న ఇన్సూరెన్స్​ వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కరోనా నివారణకు సింగరేణిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 50 వేల టెస్ట్​ కిట్లను తెచ్చామని, మరో 3 వేల కిట్లు త్వరలోనే వస్తాయన్నారు.

For More News..

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ!

మా నేతల ఫోన్లు ట్యాపింగ్​ చేస్తున్నరు

నెల అయినా బురదల్నే.. వరద నుంచి బయటపడని సిటీ కాలనీలు