బెంగళూరు సిటీకి మంచినీటి కష్టాలు : నీళ్లు వేస్ట్ చేస్తే రూ.5 వేల ఫైన్ అంట..!

బెంగళూరు సిటీకి మంచినీటి కష్టాలు : నీళ్లు వేస్ట్ చేస్తే రూ.5 వేల ఫైన్ అంట..!

బెంగళూరులో ప్రస్తుతం నీటి కొరత మాములుగా లేదు. అసలు ఎండకాలం మొదలు కాకముందే కన్నడ ప్రజలకు నీటి కష్టాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. దీంతో నీటి కోసం కన్నడిగులు  తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నీటిని వృథా చేస్తే రూ. 5 వేలు విధించాలని నిర్ణయించింది. అంతేకాకుండా నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించేందుకు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.  నీటి వృథాను కట్టడి చేసేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది.  

వీటితో పాటుగా తాగునీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలోని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ.. ఆ సొసైటీలో నివసించే వారికి నోటీసులు జారీ చేసింది.వేసవి ముదిరే కొద్దీ 40 శాతానికి పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేసింది.   బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్‌ బోర్డు నుంచి గత 4 రోజులుగా నీరు రావడం లేదని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ తెలిపింది. ప్రస్తుతం బోర్ల ద్వారా అక్కడి వారికి నీరు అందిస్తున్నామని తెలిపింది. 

ఇదిలా ఉంటే ఈ నీటి సమస్యను కొందరు  ట్యాంకర్ ఓనర్లు ఆసరాగా తీసుకుని  జనాల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  ఒక్కో ట్యాంకర్‌ను రెట్టింపు, 3 రెట్ల ధరలకు విక్రయిస్తున్నారు. ఈ  పరిస్థితిని ఎదుర్కొనేందుకు  అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు.