కరీంనగర్ జిల్లా: రాష్ట్రంలో 20శాతం జనాభా ఉన్న యాదవుల సంక్షేమం కోసం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఏటా రాష్ట్ర బడ్జెట్ లో 5వేల కోట్లు కేటాయించడంతోపాటు.. 50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు 5వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ను సంఘం నాయకులు, ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాములు యాదవ్ రాష్ట్రంలోని యాదవుల సంక్షేమం కోసం పోరాటం చేస్తామన్నారు. మూడు ప్రధాన డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.