18 ఎకరాలు.. రూ. 5 వేల కోట్లు : దేశంలోనే అతిపెద్ద రియల్ డీల్

18 ఎకరాలు.. రూ. 5 వేల కోట్లు : దేశంలోనే అతిపెద్ద రియల్ డీల్

ఇటీవల హైదరాబాద్ లోని కోకాపేటలో  హెచ్ఎండీఏ  ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఎకరా రూ. 100.75 కోట్లు పలికి  దేశంలోనే చరిత్ర సృష్టించింది.  ఈ ధరను చూసి చాలా మంది వామ్మో ఎకరా వంద కోట్లా అని షాకయ్యారు.  మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై దేశంలోనే కాదు ప్రపంచంలోనే  కాస్ట్ లీ నగరాల్లో   ఒకటన్న సంగతి తెలిసిందే.  అయితే ఇపుడు ముంబై నడిబొడ్డున  ఎకరా రూ. 200 ల కోట్లకు పైగా పలుకుతోందంట. దేశంలోని రియల్ డీల్ ఇదే పెద్దదన్న మాట.

ముంబై నగరంలోని వొర్లీ బుధ్కర్ మార్గ్‌లో  బాంబే డైయింగ్ మిల్లుకు చెందిన 18 ఎకరాల భూమి ఉంది.  జపాన్‌కు చెందిన సమిటోమో అనే సంస్థ దాదాపు రూ.5 వేల కోట్లకు ఈ భూమిని కొనుగోలు చేయబోతుందంట.  ఇదే గనుక జరిగితే   ఎకరం భూమి విలువ రూ.277 కోట్లకు పైన పలుకుతున్నట్లే..  వొర్లీలోని లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమికి సంబంధించి లీగల్ వివాదాలు లేవని నిర్ధారించుకోవడం కోసం వాడియా చాందీ అనే లా ఫర్మ్ తన క్లయింట్ తరఫున  పబ్లిక్ నోటీసు జారీ చేసింది.

ALSO READ : వీడియో: అక్తర్ వారసుడు దొరికాడు.. అదే స్టైల్.. అదే యాక్షన్

జపాన్ సంస్థ భూములు కొనుగోలు చేస్తుండటంతో   సెప్టెంబర్ 6న మధ్యాహ్నం వాడియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఉన్న భవనాలన్నీ ఖాళీ చేస్తున్నారు.  ఛైర్మన్ ఆఫీస్ ను దాదర్ -నైగామ్ లోని బాంబే డైయింగ్ కు మార్చారు. వాడియా హెడ్ క్వార్టర్  వెనకాల ఉన్న నటి శిల్పా శెట్టి బాస్టియన్ రెస్టారెంట్ కూడా మూసివేశారు. దీంతో  నస్లీ వాడియా నియంత్రణలో ఉన్న సెంట్రల్ ముంబైలోని ఈ ప్రధాన రియల్ ఎస్టేట్ భూమిపై ఏం జరుగబోతుందని చర్చ జరుగుతోంది. 

కొన్నేళ్ల క్రితం  బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ. 6 వేల700 కోట్లకు  హిరానందని గ్రూప్ ఆఫీసులు,  పొవాయ్‌లోని రిటైల్ స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పూర్తి భవనాల కోసం అయితే.. వాడియా ఒప్పందం ఖాళీ స్థలం కోసం.

వాడియా గ్రూప్ ఛైర్మన్ నుస్లీ వాడియా ముంబైలో పెద్ద మొత్తంలో భూములున్న ప్రైవేట్ వ్యక్తుల్లో ఒకరు.  FE దిన్‌షా ఛారిటీస్ , FE దిన్‌షా ట్రస్ట్‌కు ఇతనొక్కడే అడ్మినిస్ట్రేటర్.  దిన్‌షా భూ హోల్డింగ్‌లు ఒకప్పుడు 1,500 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయంటారు.  ప్రధానంగా పశ్చిమ శివారు ప్రాంతాలైన మలాడ్,  బోరివ్లీలో ఈ భూములు ఉన్నాయి. అయితే  ఎక్కువ భాగం ఇప్పుడు ఆక్రమణకు గురయ్యాయి.