రూ.52 కోట్ల పత్తి బుగ్గిపాలు

  • మేడ్చల్​లో భారీ అగ్నిప్రమాదం
  • కుప్పకూలిన రూ.6 కోట్ల గోదాం
  • రాత్రి వరకు అదుపులోకి రాని మంటలు

మేడ్చల్​, వెలుగు: మేడ్చల్‌‌ పీఎస్ పరిధిలో శనివారం మధ్నాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూడూరులోని కాటన్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోను దాదాపు రూ.52 కోట్ల పత్తి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రూ.6 కోట్ల గోదాం కుప్పకూలింది. 

మంటలు చెలరేగిన విషయాన్ని కార్మికులు గమనించి, వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు 10 ఫైర్ ఇంజిన్లతో 42 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ రాత్రి వరకు అదుపులోకి రాలేదు. గోదాం గేటుకు వెల్డింగ్ మరమ్మత్తులు చేస్తుండగా, నిప్పు రవ్వలు ఎగిరి పత్తిలో పడడంతో మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటలు  అదుపులోకి రాలేదని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయకృష్ణ తెలిపారు.