లిక్కర్ అమ్మితే రూ.60 వేల జరిమానా.. ఏకగ్రీవంగా గ్రామస్తుల తీర్మానం

లిక్కర్ అమ్మితే రూ.60 వేల జరిమానా.. ఏకగ్రీవంగా గ్రామస్తుల తీర్మానం

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్తులు శుక్రవారం గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నందున గ్రామంలో మద్యనిషేధం విదిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి గ్రామంలో ఎవరైనా లిక్కర్​ విక్రయిస్తే రూ.60 వేల జరిమానా విధిస్తామని, మద్యం విక్రయించిన వారిని గుర్తించి గ్రామపెద్దలకు సమాచారమిచ్చిన వ్యక్తికి రూ.10వేల నజరానా అందిస్తామని ప్రకటించారు. 

సమీపగ్రామాలకు చెందిన వ్యక్తులు పోతాయిపల్లితోపాటు గ్రామ శివార్లలో మద్యం సేవిస్తే వారికి రూ.5వేల జరిమానా వేయాలని తిర్మానించారు. సమావేశంలో వీడీసీ అధ్యక్షుడు మఠంమల్లయ్య, గ్రామ తాజా మాజీ సర్పంచి లక్ష్మీనారాయణ, సీఏసీఎస్​ డైరెక్టర్​ నీరడి రామలింగం, అంజయ్య, సాయిరాం, అల్లూరీ, ఎర్రంనారాయణ, శంకర్​, నర్సింలు, సాయన్న, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.