సూరత్: గుజరాత్ లోని సూరత్ లో చాలా కాస్లీ గణపతి పూజలందుకుంటున్నాడు. కానీ భక్తులకు మాత్రం ఒక్కరోజే దర్శనానికి అనుమతి ఇస్తారు. ఆ గణపతి విలువ రూ. 600 కోట్లు! వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా ఈ వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. పరిమాణంలో ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. ఈ వజ్రం ధరపై కనుభాయ్ వెల్లడించకపోయినా.. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకొచ్చారు. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉందని తన తండ్రికి కల వచ్చిందని, తెరిచి చూస్తే నిజంగానే వినాయకుడి ఆకారంలో ఉందన్నారు.అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి తమ కుటుంబం పూజలు చేస్తున్నదంటున్నారు కనుభాయ్..!