మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..ఏ కారు కొనాలో తెలియక డైలమాలో ఉన్నారా..మంచి మైలేజ్ , మీ బడ్జెట్లో కారు కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసం..రూ. 7 లక్షల రేంజ్ ధరలో లీటర్ కు 25 కిలోమీటర్ల ప్రయాణం అందించే వివిధ రకాల కంపెనీల కార్ల గురించి పూర్తి వివరాలు మీకోసం అందిస్తున్నాం.. అ వేంటో ఓ లుక్కేద్దాం పదండి.
2024 మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకీ ఈ రోజు నాలగవ తరం స్విఫ్ట్ ను భారతదేశంలో 6.49 నుంచి 9.88 లక్షల ఎక్స్ రూం ధరతో ప్రారంభించింది. ఇది కొత్త 1.2 3 సిలిండర్ NA ఫెట్రోల్ ఇంజిన్ తో లభిస్తోంది. ఇది 80.46 bhp, 111.7 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ను 5.91 నుంచి 8.66 లక్షల మధ్య ఎక్స్ షోరూం ధర శ్రేణిలో అందిస్తుంది. ఇది 1.2 L 4 సిలిండర్ NA పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తోంది. ఇది 81.86 bhp, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సిట్రోయెన్ C 3
సిట్రోయెన్ C 3 ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ C3 హ్యాచ్ బ్యాక్ ను 6.16 లక్షలనుంచి 9.23 లక్షల ఎక్స్ షోరూమ్ ధర శ్రేణిలో అదిస్తుంది. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంది. అందులో 1.2L,3 సిలిండర్ NA పెట్రోల్ ఇంజిన్ 80.87 bhp, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు 1.2L3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన 108.50bhp 190 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
టాటా ఆల్ర్టోజ్
టాటా ఆల్ర్టోజ్ ను రూ. 6.64 లక్షల నుంచి 10.79 లక్షల ఎక్స్ షోరూం ధరతో అందిస్తోంది. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లను అందిస్తుంది. అందులో 1.2L3 సిలిండర్ NA పెట్రోల్ ఇంజిన్ 86.80bhp 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.2L 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 108bhp, 140 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5L4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 88.76 bhp, 200 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
టొయోటా గ్లాన్జా
టొయోటా గ్లాన్జా ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్, ఇది మారుతి సుజుకీ బాలెనో ఆధారితం. ఇది రూ. 6.86 లక్షల నుంచి 9.99 లక్షల ఎక్స్ షోరూం ధర శ్రేణిలో అందిస్తుంది. ఇది 88bhp, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ i20
హ్యుందాయ్ i20 దేశంలో కొనసాగుతున్న ఓల్డ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్. ఇది రూ. 7.04 లక్షల నుంచి 11.20 లక్షల ఎక్స్ షోరూం ధర శ్రేణిలో అందిస్తుంది. i20 1.2L4 సిలిండర్NA పెట్రోల్ ఇంజిన్ తో లభ్యం.. ఇది 81.86bhp, 115Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.