కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైంది. దీంతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జనం ఆలోచించే పరిస్థితి. ఒకవేళ బయటకు వెళ్లినా సోషల్ డిస్టెన్స్, ఫేస్ మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేకుంటే కొన్ని దేశాలు, రాష్ట్రాల్లో ఫైన్ కూడా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాషన్ ప్రపంచం దృష్టి మాస్కులపై పడింది. అందుకే ఇప్పుడు లగ్జరీ మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కలర్ఫుల్గా ఉండటం కాదు.. బంగారం, ముత్యాలు, వజ్రాలు పొదిగిన స్టైలిష్ మాస్క్‌లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. జపాన్‌కు చెందిన కాక్స్ కో మాస్క్ డాట్ కామ్ సంస్థ ఖరీదైన మాస్కులను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఒక్కో మాస్క్ రేటు ఎంతో తెలుసా. 9,600 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.7 లక్షలు. ఒక్కో మాస్క్‌లో 0.7 క్యారెట్ డైమండ్లు, 300 స్వరోవస్కి క్రిస్టల్స్, 330 జపనీస్ అకోయ ముత్యాలతో తయారు చేశారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఈ మాస్క్‌లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.
For More News..