ప్రపంచమంతటా పుష్ప 2 (Pushpa2) ఫీవర్ పట్టుకుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్కు (2024 డిసెంబర్ 5) ఆరురోజులే టైం ఉండటంతో హంగామా మొదలైంది. వరల్డ్ వైడ్గా 11,500 థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఇక రేపు నవంబర్ 30న ఇండియాలో కూడా బుకింగ్ఫ్ షురూ కానున్నాయి. అయితే, అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఇలా బుకింగ్స్ ఓపెన్ చేస్తే అలా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోవడం పక్కా అనేలా ఉంది ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun) ఫీవర్.
లేటెస్ట్ విషయానికి వస్తే.. పుష్ప 2 కోసం రెండు తెలుగు రాష్టాల్లోని ఫ్యాన్స్ 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే.. చిన్నపిల్లల నుంచి యంగ్ ఆడియన్స్ వరకు అల్లు అర్జున్ హావభావాలను అనుకరించేలా! ఇంకొందరైతే తగ్గేదేలే.. పుష్ప అంటే ఫైర్.. అలా ప్రతీదీ ఫ్లోలో అనేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆడియన్స్ వీక్ నేస్ ను క్యాష్ చేసుకోనున్నారు మేకర్స్.
పుష్ప 2 గ్రాండ్గా ఇండియా హయ్యెస్ట్ రిలీజ్ సినిమాగా ఎలానైతే వస్తుందో.. అలానే థియేటర్ టికెట్ల రేట్స్ కూడా ఉండనున్నాయట. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచడం తెలిసిందే. ఇది చాలా కామన్. అయితే, పుష్ప 2 కోసం మాత్రం గవర్నమెంట్ పెంచే రేట్ కన్నా మరో 150 రూపాయల నుంచి 200 వరకు ఎక్కువ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐతే, అలా ఉండేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సినిమా మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం.
ALSO READ : Vidaamuyarchi: సస్పెన్స్ థ్రిల్లర్‌గా అజిత్ మూవీ టీజర్.. స్టార్ హీరోలకి పోటీగా సంక్రాంతి బరిలో
ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. మూవీ రిలీజైన ఫస్ట్ డే నుంచి 4 రోజుల వరకు పెంచే రేటు కన్నా రూ.200 లు ఎక్కువ ఉంటుందట. ఇక ఐదో రోజు నుంచి 10 వ రోజు వరకు పెద్ద హీరోలకి పెంచే రేట్లు ఉండబోతున్నాయట. ఇక ఆ తర్వాత 11 వ రోజు నుంచి మామలు రోజులలో ఉండే థియేటర్ ధరలు ఉండబోతున్నాయట. ఇది ఇలానే జరిగితే.. సాధారణ ప్రేక్షకుడు థియేటర్స్లో పుష్ప 2 సినిమా చూడటం కష్టం అనేలా ఉంది. థియేటర్‌లకు వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు. ఏమవుతుందో చూడాలి. సాధారణంగా మల్టీప్లెక్స్ రేట్లు 150 నుంచి రూ. 410. ఒకవేళ పెంచితే ఇప్పుడేలా ఉండనున్నాయంటే
తెలంగాణలో పుష్ప 2 కోసం అంచనా వేసిన టిక్కెట్ ధరలు:
మల్టీప్లెక్స్‌లు : 2D-రూ : 610
3D-రూ: 710
సింగిల్ స్క్రీన్‌లు : 2D-రూ : 325
3D-రూ: 375