
ముషీరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న రూ. 7500 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు లెక్చరర్స్ కు జీతాలు చెల్లించడం లేదన్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిలు చెల్లించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో వేముల రామకృష్ణ కలిసి వినతిపత్రం అందజేశారు.