రాయపర్తిలో రూ.8 లక్షల విలువైన మద్యం పట్టివేత

వరంగల్ జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. రాయపర్తి మండలం కిష్టాపురం ఎక్స్ రోడ్ చెక్ పోస్ట్  వద్ద డీసీఎంలో 8 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని తరలిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ నుంచి తొర్రూర్ వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో మద్యాన్ని తరలిస్తున్న  వాహనం పట్టుబడింది.

డీసిఎంలో తరలిస్తున్న 48కాటన్ల మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొర్రూరులో  ఓ మద్యం దుకాణానికి తరలిస్తుండగా సమయం మించిపోవడంతో అధికారులు డీసిఎంను  అదుపులోకి తీసుకున్నారు.  కాగా, నంబర్ 30వ తేదీ గురువారం పోలింగ్ జరగనుండడంతో.. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు బంద్ అయ్యాయి.