రూ.8 లక్షల హవాలా డబ్బు సీజ్

రూ.8 లక్షల హవాలా డబ్బు సీజ్

మెహిదీపట్నం, వెలుగు: మాసబ్​ట్యాంక్​లో రూ.8లక్షల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఏసీ గార్డ్స్​ఏరియాలో ఉండే మహమ్మద్​అఖిల్ మేకల వ్యాపారి. ఇతను దుబాయ్​కు చెందిన అబ్బు అనే వ్యాపారి కోసం పనిచేస్తున్నాడు. అబ్బు సూచనలతో గురువారం అర్ధరాత్రి తర్వాత రూ.8 లక్షల హవాలా డబ్బును తరలిస్తుండగా మాసబ్ ట్యాంక్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్​కమ్​ట్యాక్స్​అధికారులకు అప్పించారు. అఖిల్​ను అరెస్ట్​చేసి రిమాండుకు తరలించారు.