Itel తన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ itel P55T ని భారత్ లో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ 4GB RAM, 128 GB స్టోరేజ్ తో Unisoc T606 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఓ ప్రత్యేక ఉంది.. అదేంటంటే దీని డిస్ ప్లే ఐఫోన్ వంటి డనమిక్ బార్ ఫీచర్ తో అందించబడుతోంది. దీంతోపాటు 6000 mAh బ్యాటరీతో వస్తోంది. Itel P55T ధర 4GB+128GB వేరియంట్ తో రూ. 8,199 లు. ఇది ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో కొనుగోలు చేయొచ్చు.
Itel P55T స్పెసిఫికేషన్లు
డ్యూయెల్ సిమ్ (నానో) సపోర్టు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14(గో ఎడిషన్ ) పై రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో 6.56 అంగుళాల HD+(720x1640) IPS డిస్ ప్లేను కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం హోల్ పంచ్ కటౌట్ కూడా ఫోన్ డిస్ ప్లే అందించబడుతుంది. ఇది డైనమిక్ బార్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. దీంతో నోటిఫికేషన్లను వేగంగా చూడొచ్చు.
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Octa Core Unisoc T 606 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ఆన్ బోర్డు ర్యామ్ ను 8GB విస్తరించవచ్చు. ఫొటో గ్రఫీ కోసం ఫోన్ వెనక భాగంలో 50 MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ఉంటుంది. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంగాలో 8MP కెమెరా అందించబడుతుంది. ఈ ఫోన్ ఇంటర్నల్ మెమరీ 128GB, ఇక భద్రత విషయానికొస్తే.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తోంది.
కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్,GPS, 4G, OTG, USB టైప్ -C పోర్టుకు సపోర్ట చేస్తుంది. దీని బ్యాటరీ 6000 mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 155 గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.