బిజినెస్ డెస్క్, వెలుగు: అండర్ వరల్డ్‌కు క్రిప్టో కరెన్సీలు కొత్త ఆయుధంలా మారుతున్నాయి. బెట్టింగ్‌లు, మనీ లాండరింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, టెర్రరిస్ట్‌లకు ఫండింగ్ అంతా ఇక క్రిప్టోల్లోనే జరుగుతోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం కూడా క్రిప్టో కరెన్సీలను హవాలాకు, ఇల్లీగల్ బెట్టింగ్‌కు వాడుతున్నాడనే వార్తలూ వస్తున్నాయి. కరోనా టైమ్‌లో దావూద్ ఇల్లీగల్ బెట్టింగ్స్ బిజినెస్ అతని మెయిన్ బిజినెస్‌గా ఎదిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది. ఈ అవినీతి చర్యలను ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో మాత్రం ఈ సంస్థ బయటపెట్టలేదు. దావూద్ క్రిప్టో నెట్‌వర్క్ గురించి కూడా చెప్పలేదు. కరోనా సంక్షోభం టైమ్‌లో డార్క్ వెబ్, క్రిప్టోల ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్స్ భారీగా జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పారలెల్ ఎకానమీగా ఇది నడుస్తోందని, వందల వేల కోట్ల రూపాయలు ఇల్లీగల్‌గా చేతులు మారుతున్నాయని చెప్పారు. ఈ ఎకోసిస్టమ్‌లో క్రిప్టో కరెన్సీలు కీలకంగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, మనీలాండరింగ్ కేసుకి సంబంధించి దావూద్ బ్రదర్ ఇక్బాల్ కస్కర్‌ను ఈడీ కస్టడిలోకి తీసుకుంది. ఈ నెల 24 వరకు ఆయన్ని విచారించనుంది. టెర్రరిస్టులకు ఫండింగ్ అందిస్తున్నారనే ఆరోపణలతో ఇక్బాల్‌పై, దావూద్‌పై తాజాగా మనీలాండరింగ్ కేసును ఈడీ ఫైల్ చేసింది.
క్రిమినల్స్ దగ్గర రూ. 82,500 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీలు..
2021 లో మొత్తం 11 బిలియన్ డాలర్ల (రూ.82,500 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీలు క్రిమినల్స్ చేతిలో ఉన్నాయని బ్లాక్‌చెయిన్ డేటా కంపెనీ చైనాలసిస్ ప్రకటించింది. కొన్ని ఇల్లీగల్ సోర్స్‌ల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో క్రిప్టోలను క్రిమినల్స్ హోల్డ్ చేస్తున్నారని ఈ సంస్థ వివరించింది. కిందటేడాది క్రిమినల్ బ్యాలెన్స్‌లలో 93% అంటే 9.8 బిలియన్ డాలర్ల ఫండ్స్ మాయమయ్యాయని కూడా పేర్కొంది. కాగా,2020 లో ఇలా క్రిమినల్ చేతుల్లో 3 బిలియన్ డాలర్ల (రూ. 22,500 కోట్ల) విలువైన క్రిప్టోలు ఉన్నాయి.
ట్రాక్ చేయడం కష్టం..
బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను ఎవరైనా మైనింగ్ చేయడానికి వీలుంటుంది. మైనింగ్ చేసేవారి గురించి ఎవరికీ తెలియదు. క్రిప్టో కరెన్సీలు సెంట్రల్ బ్యాంకుల రెగ్యులేషన్స్ కిందకు రావు కాబట్టి, వీటి ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేయడం కష్టం. బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేయడానికి అవినీతి నిరోధక సంస్థలు సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను డెవలప్ చేస్తున్నాయి. కానీ, అండర్‌వరల్డ్ క్రిమినల్స్ మరింత తెలివిగా మారుతున్నారు. ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేయకుండా వీలుండే ప్రైవసీ కాయిన్లను ఉపయోగిస్తున్నారు. ట్రాకింగ్‌కు వీలుకాని మోనెరో, ఎథరమ్, జెడ్‌క్యాష్ వంటి క్రిప్టోలకు అండర్‌వరల్డ్‌లో బాగా పాపులారిటీ ఉందని 2018 లో బ్లూమ్‌బర్గ్ పేర్కొనడం గమనించాలి.
బిట్‌కాయిన్లతో డ్రగ్స్ డీల్
దేశంలో డ్రగ్స్ ట్రాఫికింగ్‌లో క్రిప్టో కరెన్సీలను వాడుతున్నారనే విషయం కిందటేడాది డిసెంబర్‌లో బయటపడింది. సౌత్ భోపాల్‌కు చెందిన డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసు మిస్టరీ అహ్మదాబాద్‌లో బయటపడింది. ఇద్దరు ‘క్రిప్టో అంగాడియాలు (కొరియర్లు)’ యూఎస్‌లోని డ్రగ్ మాఫియాతో రిలేషన్స్ పెట్టుకున్నారనే విషయాలను అధికారులు బయటపెట్టారు. డార్క్ వెబ్‌లో గ్లాన్ రిలే స్టూడియో జే. గా ఆపరేట్ అవుతున్న ఈ డ్రగ్ మాఫియాతో దేశంలోని ఈ క్రిప్టో అంగాడియాలకు ఓ వ్యక్తి ద్వారా లింక్ కుదిరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, సెలూన్ షాపును నడుపుకునే వందిత్ పటేల్ ద్వారా ఈ డ్రగ్ డీల్స్ జరిగేవని పోలీసులు చెప్పారు. యూఎస్ డ్రగ్ మాఫియా నుంచి వందిత్‌కు క్యూఆర్ కోడ్, 12 ఫేజ్‌ల పాస్‌వర్డ్స్ వచ్చాయని తెలిపారు. ఈ డిటైల్స్‌ను క్రిప్టో అంగాడియాలకు చెబితే లోకల్ కరెన్సీతో క్రిప్టోలు కొని వాటిని ఈ డ్రగ్ మాఫియాకు పంపేవారని అన్నారు. తేదీలు, టైమ్, అమౌంట్‌తో సహా ఈ డ్రగ్ మాఫియాతో జరిపిన క్రిప్టో ట్రాన్సాక్షన్ల డిటెయిల్స్‌ను వందిత్ డైరీ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు క్రిప్టో అంగాడియాలను అదుపులోకి తీసుకున్నారు. ‘పెద్ద మొత్తంలో మనీని హవాలా చేయడానికి క్రిప్టోలను ఉపయోగిస్తున్నారు. ఈ కరెన్సీలను ట్రాక్ చేయడం చాలా కష్టం. టెర్రరిస్టులకు, డ్రగ్ ట్రాఫికింగ్‌కు క్రిప్టోల ద్వారా ఫండ్స్ అందుతున్నాయి. మేము గుర్తించిన ఇద్దరు క్రిప్టో అంగాడియాలు ఇప్పటి వరకు 3 లక్షల డాలర్ల (రూ. 2.25 కోట్ల) ను యూఎస్ డ్రగ్ మాఫియాకు క్రిప్టోల ద్వారా హవాలా చేశారని అంచనా. వందిత్ పటేల్‌కు ఈ మాఫియా నుంచే డ్రగ్స్ వచ్చాయి’ అని ఒక ఆఫీసర్ చెప్పారు.