
పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డులో గోదాం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఏఎంసీ చైర్పర్సన్ ప్రమోదిని అన్నారు. శుక్రవారం పెబ్బేరు మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడారు. 5500 మెట్రిక్ టన్నుల కొత్త గోదాం నిర్మాణానికి రూ.5.50 కోట్లు, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన గోదాం రెనోవేషన్ కు రూ.3 కోట్లు, మార్కెట్ యార్డు ఆఫీసు విస్తరణకు రూ.44 లక్షలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
వాటిని శనివారం ప్రారంభించనున్నామని చెప్పారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, డైరెక్టర్మోతె రాముడు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.