- ఏడాది తర్వాత నిందితుడి అరెస్టు
- రూ.3.5 లక్షలు స్వాధీనం
ములుగు, వెలుగు: కంపెనీ డీలర్షిప్కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోగా రూ.8.9 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిని ఏడాది తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొండ వెంకటరాజు ప్రైవేట్ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏడాది క్రితం కరోనా టైంలో ఇంటివద్దనే ఉన్నాడు. ఆ సమయంలో ఆన్లైన్లో జియో మార్ట్ డీలర్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్చేశాడు. డీలర్షిప్ఇచ్చేందుకు కంపెనీకి డిపాజిట్చేయాలని చెప్పగా ఆన్లైన్ ద్వారా రూ.8.9 లక్షలు కంపెనీ పేరిట ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్ఫర్చేశాడు. డబ్బులు వేసిన తర్వాత కంపెనీ పేరిట ఉన్న ఫోన్స్విచ్ఆఫ్ అయ్యింది. కంపెనీకి ఫోన్‌చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీలర్షిప్కావాలంటూ ఆన్లైన్లో అప్లై చేసి నిందితుడికి ఎర వేశారు. ఫోన్నంబర్ఆధారంగా నిందితుడు కర్నాటక రాష్ట్రం కొడుగు జిల్లా కుశాల్నగర్మండలం చౌటెల్లి గ్రామానికి చెందిన కేవీ. మహేంద్రగా గుర్తించారు. కర్నాటక వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.3.5 లక్షలు రికవరీ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.