కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గంలోని రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి 91 కోట్ల 51 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 13 రోడ్లు, 5 బ్రిడ్జిలు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు మంజూరైనట్లు తెలిపారు.
గ్రామ ప్రజలకు తెలియకుండా కరెంట్ కట్ చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ కుమార్, భూపతి రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సంజీవ్ యాదవ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.