ఇల్లు సర్దుతుంటే.. చైనా రాజుల మగ్గు బయటవడ్డది
95 లక్షల విలువ చేస్తదన్న లండన్ కంపెనీ
డెర్బిషైర్(లండన్): కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టింది..బయటకు వెళ్లే వీలు లేక, పొద్దుపోక లండన్లోని డెర్బిషైర్ సిటీలో ఓ పెద్దాయన ఇంట్లోని పాత సమాన్లను సర్దడం మొదలెట్టిండు. అందులో అక్కెరకొచ్చేటియి తీసి పక్కన పెడుతుండగా పాతకాలం నాటి టీ పాట్ ఒకటి బయటపడ్డది. ఇదేదో డిఫరెంట్గా ఉంది, దీని కతేందో తెలుసుకుందామని ఆ పెద్దాయన ఇంటర్నెట్లో వెతికిండు. తన దగ్గర ఉన్నసోంటి టీ పాట్ హాన్సన్ ఆక్షనీర్స్ వాళ్ల సైట్లో కనిపించింది. దీంతో వాళ్లను సంప్రదించగా.. ఆ టీపాట్కు సంబంధించిన చరిత్రను చెప్పారట.
18వ శతాబ్దం నాటి మగ్గు..
అది మామూలు టీపాట్ కాదు.. 18 వ శతాబ్దంలో చైనా చక్రవర్తులు వైన్ తాగేందుకు ఉపయోగించే మగ్గు అని, ఎవరికి అమ్మినా 20 వేల నుంచి 40 వేల పౌండ్లు ఈజీగా ఇస్తారని అన్నరట. అదే చైనా వాళ్లకు అమ్మితే తక్కువలో తక్కువ లక్ష పౌండ్లకు గిట్టుబాటైతదని చెప్పిన్రట. మన రూపాయలలో లెక్కేస్తే దాదాపు 95 లక్షలు. ఈ వివరాలన్నీ వినడంతో పెద్దాయన సంతోషం పట్టలేకపోయిండు.
For More News..