సీఎం రేవంత్ తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ

సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య. సెక్రటేరియట్ కు వచ్చిన కాలె యాదయ్య..పొన్నం ప్రభాకర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డితో పలుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్ ను కలిశారు. జనవరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిశారు. పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. తర్వాత తాము పార్టీ మారడం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తర్వాత కొన్ని రోజులకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్పారు.