రాజకీయంగా మహిళలకు అన్యాయం .. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఆరోపణ

రాజకీయంగా  మహిళలకు అన్యాయం .. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయట్లేదన్నారు. 

దీంతో మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో మహిళలు నష్టపోయారన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో కవిత మాట్లాడారు. జనాభా లెక్కలకు బడ్జెట్​లో నిధులు ఎందుకు కేటాయించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.