అరగంట లేట్ గా షో వేసినందుకు PVR థియేటర్స్ కి రూ.లక్ష ఫైన్.. ఎక్కడంటే..?

అరగంట లేట్ గా షో వేసినందుకు PVR థియేటర్స్ కి రూ.లక్ష ఫైన్.. ఎక్కడంటే..?

కొంతమంది మనశ్శాంతి కోసం సినిమా చూసి ఎంజాయ్ చెయ్యాలని థియేటర్స్ కి వెళుతుంటారు. కానీ థియేటర్ లో మాత్రం చెప్పనా టైం కి షో ప్రసారం చెయ్యకుండా ఆడియన్స్ టైం వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఇలా చేసినందుకు  PVR సినిమాస్ మరియు PVR ఐనాక్స్ లిమిటెడ్‌లను యాజమాన్యంపై రూ.లక్ష ఫైన్ విధించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగును చూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే గత ఏడాది డిసెంబర్ నెలలో బెంగళూరుకు చెందిన ఓ యువకుడు PVR థియేటర్ లో "సామ్ బహుదూర్" సినిమా చూసేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. దీంతో 4 గంటలకి షో ఉండటంతో అనుకున్న సమయానికి థియేటర్ కి వెళ్ళాడు. కానీ 4 గంటలకి ఎండలు కావాల్సిన సినిమా 30 నిమిషాల ఆలస్యంతో 4:30 గంటలకి మొదలైంది. అయితే ఈ అరగంట పాటూ యాడ్స్ ప్రసారం చేశారు. 

దీంతో యువకుడు 30 నిమిషాల ప్రకటలని రికార్డ్ చేశాడు. అలాగే తన సమయాన్ని వృథా చేసినందుకు ఏకంగా  బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసుని మంగళవారం విచారించారు. ఈ క్రమంలో ఆడియన్స్ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు అలాగే 30నిమిషాలపాటూ అనవసరమైన ప్రకటనలు ప్రసారం చేసి మెంటల్ గా డిస్టర్బ్ చేసినందుకుగానూ రూ. లక్ష చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. .ఇతరుల సమయం మరియు డబ్బు నుండి లాభం పొందే హక్కు ఎవరికీ లేదని కూడా కమిషన్  చెబుతూ తీర్పు ఇచ్చింది.