
- కేసీఆర్ సూచనతోనే బీజేపీ అధ్యక్షుడి మార్పు
- బీజేపీకి అమ్ముడుపోయినందుకే కవిత అరెస్ట్ ఆగింది
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ సూచనతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బీజేపీకి కేసీఆర్ అమ్ముడుపోయారని, అందుకే లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాలేదన్నారు. శుక్రవారం కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పలు వాడలను విజిట్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్అధికారం పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
బీఆర్ఎస్ సర్కారుకు బీజేపీ మద్దతు పలుకుతోందన్నారు. రాష్ట్రమంతటా దోపిడీ పాలన జరుగుతోందన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తంచేశారు. ఒకవేళ ఓడినా సిర్పూర్ ను వదిలిపెట్టి పోయేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, అర్షద్హుస్సేన్, జిల్లా ఇన్చార్జి సోయం చిన్నయ్య పాల్గొన్నారు.