
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని శంషాబాద్ మండలంలో రైతుల భూములు కాజేసేందుకు ఓ సంస్థ వ్యూహాలు రచిస్తోందని అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్మండలం గాన్సీమియాగూడ వద్ద బాధిత రైతులతో పాదయాత్రగా వెళ్లి కలిసి సంబంధిత భూములను పరిశీలించారు.
ఆ సంస్థ రాజేంద్రనగర్ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కి 15 ఎకరాల ఫాం హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే సదరు కంపెనీ ఆక్రమించుకున్న భూములను తిరిగి రైతులకు పంచి పెడతామని ప్రకటించారు. బీసీ ఎమ్మెల్యేగా చెప్పుకునే ప్రకాష్ గౌడ్ బీసీ రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే సదరు సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.