తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గుండాగిరి నడుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో లంచం తీసుకున్న మనీష్ సిసోడియాను మూడు నెలల నుంచి జైలులో పెట్టారని, సిసోడియాకు లంచం ఇచ్చిన కవిత బయటే ఉందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు.
ALSO READ: కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించవద్దు : మంత్రి కేటీఆర్
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన కుంభంకోణంపై ఈడీ అధికారులతో రైడ్ చేయించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మీద సీబీఐ కేసు ఉన్నా..ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో బీఎస్పీకి ఎలాంటి పొత్తు ఉండదన్నారు. బహుజనులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే పార్టీలతోనే బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని చెప్పారు.